Site icon
Prime9

CM Revanth Reddy : నెక్లెస్ రోడ్డులో ఫూలే విగ్రహం.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు విషయంలో కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి స్థలాన్ని పరిశీలించారు. స్థలం కోసం సర్వే చేసి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ రూపకల్పన చేయాలని చేయాలని సూచించారు.

 

 

ఫూలే విగ్రహానికి సీఎం నివాళి..
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా అంబర్‌పేటలో ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్‌చార్జి రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar