Chicken prices: గతంలో ఎన్నడు లేని విధంగా చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల్లోనే రూ. 100 ధర పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తోంది. వారం రోజుల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 240 నుంచి రూ. 260 పెరిగింది. లైవ్ కోడి రూ. 140 నుంచి 160 మధ్య విక్రయించారు. అదే ఆదివారం వచ్చే సరికి ఒక కిలోకు రూ. 100 నుంచి 120 వరకూ పెరిగింది. ఇటీవల పెరిగిన ఎండలతో కోళ్లు చనిపోతున్నాయని.. దీంతో వాటి కొరత బాగా ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయంటున్నారు.
మరో నాలుగు రోజులు ఇంతే(Chicken prices)
గ్రేటర్ లో ఆదివారం 8 లక్షల నుంచి 12 లక్షల కిలోలు, మామూలు రోజుల్లో 5 లక్షల నుంచి 7 లక్షల కిలోల చికెన్ అమ్ముడయ్యేది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలు కూడా తగ్గిందన్నారు. ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా 40 శాతం అమ్మకాలు పడిపోయినట్లు తెలిసింది. చికెన్ ధర బాగా పెరగడంతో వినియోగదారలుు మటన్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ. 400 పెడితేనే అర కిలో మటన్ వస్తుందనే భావనతో చాలామంది మటన్ వైపు మొగ్గు చూపుతన్నారు. కాగా, మరో నాలుగు రోజులు ధరలు ఇలాగే కొనసాగుతాయని.. వర్షాలు పడితే ధరలు మామూలు స్థాయికి చేరుకుంటుందని చికెన్ వ్యాపారులు తెలిపారు.
ఏప్రిల్‌లో చికెన్ ధర రూ. 150 గా ఉంది. ప్రస్తుతం ఆ ధర రెండింతలైంది. ప్రస్తుతం లైవ్ కోడి ధర రూ. 195, స్కిన్ తో రూ. 290, స్కిన్ లెస్ రూ. 320, నాటు కోడి కిలో రూ. 380 నుంచి రూ. 400 వరకుపలుకుతోంది. రవాణా ఛార్జీలు, కోళ్ల దాణా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు కొండెక్కి కూర్చున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.