Chakradar Goud: సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సామాజిక సేవ ముసుగులో.. భారీ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారణ చేస్తుండగా.. లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సామాజిక సేవ ముసుగులో.. భారీ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారణ చేస్తుండగా.. లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
నిరుద్యోగ యువతే లక్ష్యంగా.. ఉద్యోగాల పేరిట నకిలీ కాల్‌సెంటర్‌తో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సమాజంలో సామాజిక సేవకుడిగా కనిపిస్తూ అడ్డదారిలో రూ.కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల కోసం.. మూడు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. రెండు రోజులుగా నిందితుడి నుంచి కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
చక్రధర్ గౌడ్ నగరంలో ఓ బ్యాంకులో పనిచేసేవాడు. రాజకీయంగా పేరు పొందడానికి కావాల్సిన డబ్బు కోసం మోసాలకు పాల్పడ్డాడు. 2018లో నకిలీ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశాడు.
ఇతర రాష్ట్రాల యువతను లక్ష్యంగా చేసుకొని.. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నాడు.
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులకు చెందిన వేలాది మంది నిరుద్యోగుల వివవాలను సేకరించాడు. అ తర్వాత కాల్‌సెంటర్ ద్వారా ఒక టర్మ్ లో రూ.50 లక్షలు సంపాదించేవాడు.
ఇలా 11 సార్లు మోసాలకు పాల్పడి.. సుమారు రూ.50 కోట్లు కాజేసినట్లు నిర్దారణకు వచ్చారు.
ఇందుకు 1,100లకు పైగా సిమ్‌కార్డులు, 20కు పైగా బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించాడు.
నిరుద్యోగ యువతతో కొట్టేసిన నగదుతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యుల పేరిట 10 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
బాచుపల్లిలో 5 ప్లాట్లతో పాటు 5 ఖరీదైన కార్లు కొన్నట్లు తెలుస్తోంది. పెద్దమొత్తంలో డబ్బు రాగానే విలాసవంతమైన జీవితం, కాన్వాయ్.. అనుచరులతో హల్‌చల్ చేసే వాడు.
రైతులకు సాయం చేసేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లు ఆధారాలు సేకరించారు.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారంతో కీలక ఆధారాలను మాయం చేసినట్లు తెలుస్తోంది.