Site icon Prime9

TSPSC Group 1: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు.. మరో తేదీ ప్రకటన

TSPSC Exam Schedule

TSPSC Exam Schedule

TSPSC Group 1: పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు

పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కమిషన్‌ ప్రత్యేక సమావేశమైంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్ నివేదిక ఆధారంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

కొత్త తేదీ ప్రకటన..

రద్దు చేసిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇదిలా ఉండగా జూనియర్‌ లెక్చరర్స్‌ పరీక్షలతో పాటు మరికొన్ని ఎగ్జామ్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక రద్దు చేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, వీలైనంత త్వరలో వాటి పరీక్షా తేదీలను ప్రకటిస్తామని కమిషన్ వెల్లడించింది.

అయితే.. కమిషన్‌ తాజా నిర్ణయంపై గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను జ‌న‌వ‌రి 13వ విడుద‌ల చేశారు. 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

Exit mobile version