Site icon Prime9

KTR : అవయవ‌దానానికి సిద్ధం.. అసెంబ్లీలో కేటీఆర్ కీలక ప్రతిపాదన

KTR

KTR

KTR : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు వాడివేడీగా కొనసాగాయి. అవయవదానం బిల్లును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అవయవదానం బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా జీవన్‌దాన్ ద్వారా 3,724 మంది బాధితులు ఆర్గాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

 

 

అవయవదానం గురించి ప్రోత్సహించాలి..
తెలంగాణలో అవయవదానం చేయడానికి ప్రోత్సహించే బాధ్యత ప్రజాపతినిధులుగా అందరిపై ఉందని చెప్పారు. ఈ విషయంలో పార్టీ అందరి తరఫున తాను మాట్లాడంలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. స్పీకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ అవరణలో అవయవదానంపై పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని కోరారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అవయవదానంపై క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో తాను ముందు ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలందరూ అవయవ దానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అసెంబ్లీ నుంచి ప్రజలకు సందేశం పంపాలని స్పీకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సభ్యులు ముందుకు వస్తే శాసన సభలో సంతకాలు చేద్దామని పిలుపునిచ్చారు. అవయవదానంపై తొలి సంతకం తానే చేస్తానని వెల్లడించారు. అవయవదానం గొప్ప మానవీయ చర్య అని, మరింత మందికి జీవితాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar