BRS to hold state executive meet on Today: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 7 నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం, సభ్యత్వం, బహిరంగ సభ నిర్వహణపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే 25 ఏళ్లలోకి అడుగుపెడుతున్నందున సిల్వర్ జూబ్లీ వేడుకలు సైతం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.