TCS Office: హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఓ కార్పొరేట్ కంపెనీలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు సాఫ్ట్ వేర్ కంపెనీకి కాల్ చేసి చెప్పాడు. అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
టీసీఎస్ కంపెనీకి బెదిరింపు..
హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఓ కార్పొరేట్ కంపెనీలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు సాఫ్ట్ వేర్ కంపెనీకి కాల్ చేసి చెప్పాడు. అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మాదాపూర్ లోని టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీస్ లో బాంబు పెట్టినట్లు కాల్ వచ్చింది. వెంటనే ఆ కంపెనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. టీసీఎస్ కంపెనీ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఉద్యోగులను బయటకి పంపించారు. బాంబ్ స్క్వాడ్ తో కంపెనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. బాంబు లేదని తెలియడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. ఇది ఫేక్ కాల్ అని పోలీసులు గుర్తించారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అదే కంపెనీలో.. సెక్యూరిటీ విభాగంలో పని చేసిన మాజీ ఉద్యోగిగా పోలీసులు తేల్చారు. తనకు తానే పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ సమాచారం ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా కంపెనీలో బాంబు లేదని తేల్చడంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.