Site icon Prime9

Telangana Mlc Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఊహించని షాక్.. బీజేపీ అభ్యర్థి విజయం

bjp candidate avn reddy won in telangana mlc elections

bjp candidate avn reddy won in telangana mlc elections

Telangana Mlc Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల సమరానికి సై అనుకోవాల్సిన తరుణంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. కాగా తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికారంలో వస్తామని గెలుపు పైన అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉన్న క్రమంలో షాకింగ్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి. ఈ ఊహించని షాక్ తో హ్యాట్రిక్ గా తెలంగాణలో విక్టరీ సాధించాలని భావిస్తున్న బీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగింది. మొత్తం 29,720 ఓట్లలో 25,866 ఓట్లు పోలయ్యాయి. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా సారథ్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. గురువారం అర్ధరాత్రి 1.40 గంటల వరకు ఎన్నికల లెక్కింపు జరిగింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. ఏ పార్టీ అభ్యర్థికీ సరైన మెజార్టీ రాలేదు. అంటే 50 శాతం మించి ఓట్లు పడలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది. వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో తేలిన ఫలితం (Telangana Mlc Elections)..

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7,505 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి 6,584, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి 4,569, కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డికి 1,907 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి 1,236 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సుమారు 1,150 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. అయితే, వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

కాగా మొత్తానికి ఇప్పుడు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు.

Exit mobile version