Site icon Prime9

Bhavishyavani : అగ్ని ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. “భవిష్యవాణి”లో ఇంకేం చెప్పారంటే !

bhavishyavani from securendarabad ujjayani temple bonala

bhavishyavani from securendarabad ujjayani temple bonala

Bhavishyavani : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మరో కీలక ఘట్టం నిర్వహించారు. బోనాలలో భాగంగా చేపట్టే.. “రంగం” కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగింది. ముందుగానే జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వెల్లడించారు. ‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. గత ఏడాది చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారని అన్నారు. మీ అందరికి అవసరమైన బలాన్ని ఇచ్చానని అన్నారు. మీ వెంటే నేను ఉంటాను అన్నారు. వానలు పడతాయి.. మీరు భయపడకండి. ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయని.. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసని అన్నారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే నేను ఉంటానని అన్నారు. నా వద్దకి వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాదన్నారు. అలానే ఐదు వారాల పాటు తప్పనిసరిగా ప్రసాదాలు సమర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అలానే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 2014 తరువాత రైతాంగం అంత సంతోషంగా ఉన్నారని అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు.

ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు. ఎల్లవేళలా వెన్నంటి ఉండి తన భక్తులను కాపాడుకుంటానని, బలాన్ని ఇస్తానని భవిష్యవాణిలో జోగిని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భయపడవద్దని, తన వద్దకు వచ్చే వారిని కాపాడుకునే భారం తనదేనని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని,

Exit mobile version