Site icon Prime9

Bhatti Vikaramarka: స్కామ్ ల కోసమే సోమేష్ ను మళ్లీ తీసుకొచ్చారు.. భట్టి విక్రమార్క ఫైర్

batti

batti

Bhatti Vikaramarka: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. స్కామ్ లో కోసమే మళ్లీ సోమేష్ కుమార్ ను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను కేసీఆర్ తన సహహాదారుడిగా నియమించిన విషయం తెలిసిందే.

భట్టి ఆరోపణలు.. (Bhatti Vikaramarka)

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. స్కామ్ లో కోసమే మళ్లీ సోమేష్ కుమార్ ను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను కేసీఆర్ తన సహహాదారుడిగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ మేరకు రిటైర్డ్ అయిన అధికారులను మళ్లీ ఎందుకు నియమిస్తున్నారో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే.. ఆ రాష్ట్రంలోనే పని చేసుకోవాలని తెలిపారు. కానీ సోమేష్‌ కుమార్‌ ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమికమయ్యారు. దీని వెనకు ఏదో పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్‌ సహాయపడ్డారు. ఇపుడు స్కామ్ లు చేయడానికే.. మళ్లీ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.

ఇబ్రహీంపట్నంలో భారీగా..

పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారు. పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు.

ఒక్క ఇ‍బ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు.

ఓఆర్ఆర్ స్కామ్ వెనకు.. సోమేష్, అరవింద్ కుమార్ ఉన్నారని భట్టి అన్నారు.

ఈ భూములను 30 సంవత్సరాల లీజులు ఇవ్వడంలో అర్ధం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని భట్టి అన్నారు.

దీంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు.

ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదన్నారు.

నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు.

కేటీఆర్, మంత్రి తలసాని ఉస్మానియా, కాకతీయ వర్సిటీకి వెళ్లే దమ్ముందా అన్నిసవాల్ విసిరారు.

Exit mobile version
Skip to toolbar