Site icon Prime9

Bandi Sanjay Comments: కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు!.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

bjp leader bandi sanjay fires on kcr and brs party ap leaders

bjp leader bandi sanjay fires on kcr and brs party ap leaders

Bandi Sanjay Comments: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. ఈడీ నోటీసుల సందర్భంగా ప్రతిపక్ష నేతలు కవితను టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.

బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. (Bandi Sanjay Comments)

బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇక ఇదే సమయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. కవితను అరెస్ట్ చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా అని సంజయ్ అన్నారు. ఈ మేరకు సంజయ్‌ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉండి ఇలా ఓ మహిళపై కామెంట్స్‌ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా.. దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన..

దిల్లీలో ఓ వైపు బీఆర్ఎస్ నేతలు నిరసన చేస్తుండగా.. తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ చర్యలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కావాలనే కుట్రపూరితంగా ఆందోళనలు చేస్తున్నారని భాజపా నేతలు విమర్శించారు. మరో వైపు మరోవైపు కవితకు మద్దతుగా హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వాటిపై బై బై మోదీ అని రాశారు. ఆరోపణలు ఎదుర్కొనే వారు బీజేపీలో చేరగానే.. ఆరోపణలన్నీ పోతాయని ఆ పోస్టర్లలో సెటైర్లు వేశారు. ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

Exit mobile version