Site icon Prime9

Minister Harish Rao: అవార్డులు ఇస్తారు.. బురద చల్లుతారు.. కేంద్రం పై హరీష్ రావు ఫైర్

Harish Rao

Harish Rao

Hyderabad: తెలంగాణ రాష్ట్రం పై బీజేపీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని మంత్రులు హరీష్ రావు, దయాకరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం. స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని వారు తెలిపారు

నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అద్భుతమని, అందుకోసం 24 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రమంత్రులకు దమ్ము ఉంటే ముందుగా రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలి. నిధులను సక్రమంగా వినియోగించడంలో విఫలమైతే వారు మమ్మల్ని విమర్శించవచ్చు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోకుండా రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆరోపించారు. తెలంగాణ చేపట్టిన రైతు బంధు, మిషన్ భగీరథ, 1962 సంచార పశువైద్యశాలలు, ఇతర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్రం తన జల్ జీవన్ మిషన్‌కు స్ఫూర్తిగా మిషన్ భగీరథను పేర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ, ఒక కేంద్ర మంత్రి రాష్ట్రాన్ని సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వం పై విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అవార్డుతో అయినా వారికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా బీజేపి నాయకులు కళ్లు తెరవాలన్నారు మంత్రులు.

తెలంగాణ రాష్ట్ర పని తీరు అనేక పథకాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. మిషన్ భగీరథ కార్యక్రమం హర్ ఘర జల్ కు ఆదర్శమయిందని అన్నారు. మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అమృత్ సరోవర్ కు ఆదర్శంగా మారిందని, రైతు బంధు ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన ఏకైక సీఎం చంద్రశేఖరావని అన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ దేశానికి దిక్చూచిగా నిలిచిందని, ఏడేళ్లలో అద్భుతాలు చేసి చూపిన రాష్ట్రం తెలంగాణ అని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ఏకైక నేత చంద్రశేఖర్ రావు అని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు

Exit mobile version