AICC in Telangana: తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పరిశీలకుల నియామకం

AICC in Telangana: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలుకు సైరెన్ మోగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నారు.

AICC in Telangana: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలుకు సైరెన్ మోగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. తెలంగాణలో సత్తా చాటేందుకు ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీపై ఎదురు దాడి చేస్తూనే.. మరోవైపు తమ పార్టీలని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి భాజపా కాంగ్రెస్ ల హైకమాండ్స్. ఈ క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీని నియమించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధు యాష్కీని, కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస రెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది. ప్రచార కమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్‌ను నియమించగా, 37 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్లు ఏఐసీసీ వెల్లడించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించినట్లు పేర్కొనింది. వీరంతా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీని పర్యవేక్షిస్తారని ప్రకటనలో తెలిపింది. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

నియోజకవర్గాల వారీగా పరిశీలకుల పేర్లో ఇలా(AICC in Telangana)..

ప్రకాష్ రాథోడ్ – ఆదిలాబాద్.

శ్రీనివాస్ మనే – భువనగిరి.

అల్లం ప్రభు పాటిల్ – చేవెళ్ల.

ప్రసాద్ అబ్బయ్య – హైదరాబాద్.

క్రిస్టోఫర్ తిలక్ – కరీంనగర్.

అరిఫ్ నసీం ఖాన్ – ఖమ్మం.

పరమేశ్వర నాయక్ – మహబూబ్‌బాద్.

మోహన్ కుమార మంగళం – మహబూబ్ నగర్.

రిజ్వాన్ హర్షద్ – మల్కాజ్ గిరి.

బసవరాజ్ మాధవరావు పాటిల్ – మెదక్.

పివి మోహన్ – నాగర్ కర్నూల్.

అజయ్ ధరమ్ సింగ్ ,నల్గొండ

సిడి మేయప్పన్ – జహీరాబాద్.

బి.ఎం నాగరాజ – నిజామాబాద్.

విజయ్ విజయ్ నామ్దేవ్ రావ్ – పెద్దపల్లి.

రుబి ఆర్ మనోహరన్ -సికింద్రాబాద్.

రవీంద్ర ఉత్తంరావు దల్వి – వరంగల్.