Aghori Wandering in Suryapet: గత కొద్ది రోజులు రాష్ట్రంలో అఘోరి పేరు మారుమోగుతుంది. గతేడాది హైదరాబాద్‌లో అఘోరి ఆకస్మాత్తుగా ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఆమె పేరు బాగా వినిపించింది. అయితే కొంతకాలంగా సైలెంట్ అయిన ఈ అఘోరి మరోసారి రాష్ట్రంలో ప్రత్యక్షమైంది. సూర్యపేట జిల్లాలో అర్థరాత్రి అఘోరి కత్తితో హల్‌చల్ చేసిన సంఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం మారింది.
శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామస్తులకు అఘోరికి మధ్య కోట్లాట చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రుగొండ గ్రామస్తులు ఒక వివాహక వేడుకకు హాజరై తిరిగి గ్రామానికి వెళుతుండగా ఎన్‌హెచ్ 65 జాతీయ రహదారి వద్ద ఆమె కనిపించింది. దీంతో వాహనా దారులు, గ్రామస్తులు ఆమెను చూసతు వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. దీంతో వారిపై అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గ్రమస్తులకు, అఘోరికి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో తన కారులో ఉన్న తల్వారు (కత్తి)ని తీసుకుని వారి వెంటపడింది.
ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలు తీసుకుని ఆమెను దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే కత్తితో ఓ గ్రామస్తుడిపై అఘోరి దాడి చేయగా.. గ్రామస్తులంతా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తనకు గ్రామస్తులు క్షమాపణలు చెప్పాలని, లేదంటే గ్రామం విడిచి వెళ్లనంటూ అర్ధరాత్రి గ్రామంలో కత్తితో హల్‌చల్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అఘోరి మాతకు నచ్చజేప్పి అక్కడి నుంచి పంపించారు. అయితే అక్కడి నుంచి వెళ్లిన అఘోరి మాత NH65 జాతీయ రహదారి ఖాసీంపేట అడ్డ రోడ్డు వద్ద మళ్లీ ప్రత్యక్షమై అక్కడున్న యువకులతో కూడా వాగ్వాదానికి దిగిందని సమాచారం. అయితే కుంభమేళ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో నాగ సాధువులతో ఉండాల్సిన అఘోరి ఇక్కడ ఉండటం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.