Site icon Prime9

Maoists surrender : తెలంగాణలో లొంగిపోయిన 86 మావోయిస్టులు.. ఒక్కొక్కరికి రూ.25వేలు సాయం

Maoists surrender

Maoists surrender

Maoists surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు కలిపి మొత్తం 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద రూ.25వేలు అందజేశారు. తెలంగాణ సర్కారు కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోలు లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. కొత్తగూడెం పోలీసులు వారితో మాట్లాడి ఒప్పించగా, నమ్మకం ఏర్పడిన తర్వాతే లొంగిపోయారని తెలిపారు. ప్రభుత్వం తరఫున సాయం అందించినట్లు ఐజీ తెలిపారు.

 

 

మావోలకు గట్టి ఎదురుదెబ్బ..
ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ సర్కారు చేపట్టిన ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలువాలని లొంగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఛత్తీగఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీలను పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్లుగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టుల మృతిచెందారు.

 

 

ఎన్‌కౌంటర్ల దెబ్బకు లొంగిపోతున్న మావోలు..
వరుస ఎన్‌కౌంటర్లకు అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా కీలకమైన ప్రాంతాల్లో పనిచేసిన వారే అని పోలీసులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుతో ఆ పార్టీకి గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం యుద్ధంగా మారింది. వరుస ఎన్‌కౌంటర్లతో అగ్రనేతలను కోల్పోతున్నారు. కేంద్ర కమిటీల్లో ఉన్న వారు వయోభారంతో ఉన్న పరిస్థితి. ఇలాంటి సందర్భంగా కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేక తమ విలువైన జీవితాలను కుటుంబాలతో కలపాలని తెలంగాణ సర్కారు చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా పోలీసుల ఎదుట మావోలు లొంగిపోయారు.

 

 

Exit mobile version
Skip to toolbar