Site icon Prime9

Health Director: కేసీఆర్ కాళ్లపై పడిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

Health Director

Health Director

Health Director: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.మంగళవారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించి వెడుతున్న సమయంలో శ్రీనివాస్ ఆయన కాళ్లకు మొక్కారు.

ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి.. టీఆర్ఎస్ టికెట్ కోసమే శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. కొత్తగూడెం అసెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ గురించే కదా డాక్టర్ శ్రీనివాస్ సీఎం కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవి మిస్ యూజ్ చేస్తూ కొత్తగూడెంలో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు.

Exit mobile version