Telangana Corporations Chairpersons: తెలంగాణ కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చైర్మన్ల నియామక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు 35మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా జంగా రాఘవ రెడ్డి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాయల నాగేశ్వరరావు, కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్‌గా మానాల మోహన్ రెడ్డి, ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా జ్ఞానేశ్వర్, ఫిషరీస్ కోపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా మెట్టు సాయికుమార్‌కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్‌పర్సన్‌గా రియాజ్, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొడెం వీరయ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ అధినేత్రిగా కాల్వ సుజాత, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ఆర్.గురునాథ్ రెడ్డి, ఎన్. సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ & ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ చైర్మన్‌గా గిరిధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా జనక్ ప్రసాద్ మరియు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ చైర్మన్‌గా ఎం. విజయబాబులను నియమించారు. ఇలావుండగా, భారత రాష్ట్ర సమితి నాయకుడు క్రిశాంక్ ప్రభుత్వం బ్యాక్‌డేటెడ్ ప్రభుత్వ ఉత్తర్వులతో కార్పోరేషన్ ఛైర్మన్ల నియామక ఉత్తర్వులను ఎందుకు విడుదల చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మార్చి 15న జీవోలు విడుదల చేస్తే నాలుగు నెలలుగా ఏ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.అప్పుడు మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని, ఈరోజు ఎందుకు విడుదల చేశారని అడిగారు.