Site icon Prime9

Teachers are exempt from non-teaching duties: ఏపీలో బోధనేతర విధులనుంచి టీచర్లకు మినహాయింపు

Teachers

Teachers

Andhra Pradesh News: ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. . తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్ధుల చదువుపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

హైస్కూల్ విద్యార్ధుల అటెండెన్స్ విషయంలో కూడ కీలక మార్పులు తీసుకురానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్ధులకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరు లోగా విద్యార్ధులందరిని యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లోనూ ఇదే తరహాలో అటెండెన్స్ తీసుకోనున్నారు.

ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జియో ట్యాగింగ్ సాంకేతికత ద్వారా ఆయా కాలేజీల్లో మాత్రమే యాప్ పనిచేసే విధంగా యాప్ డిజైన్ చేసారు.జగన్ ప్రభుత్వంపై టీచర్లు వ్యతిరేకతో ఉన్నారనేది బహిరంగ రహస్యం. అందుకే వారికి ఎన్నికల విధులు ఇవ్వకుండా ఉండటానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

Exit mobile version