Tadipatri: తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనందరావు ఆత్మహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆనందరావు తన ఇంట్లోనే ఫ్యానుకు వురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , ఈ సంఘటన జిల్లాలో సంచలనం గా మారింది.  గత పది నెలల నుంచి తాడిపత్రి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న అనంతరావు పూరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 04:55 PM IST

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆనందరావు తన ఇంట్లోనే ఫ్యానుకు వురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , ఈ సంఘటన జిల్లాలో సంచలనం గా మారింది.  గత పది నెలల నుంచి తాడిపత్రి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న అనంతరావు పూరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.పని ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , గతంలో చాలా చోట్ల పని చేసామని ఎప్పుడు ఇంతలా టెన్షన్ పడేవాడు కాదని గత మూడు నెలల నుంచి ఈ పని ఒత్తిడి చాలా పెరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సంఘటన తెలుసుకున్న జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసులు , తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీస్తున్నారు.

పొంతన లేని వాదనలు..

తాడిపత్రి సీఐ అనంతరావు ఆత్మహత్య లో పొంతన లేని వాదనలు వినిపిస్తున్నాయి ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యానుకు వురి చేసుకుని ఆత్మ హత్య చేసుకున్న అనంతరావు కుటుంబ సభ్యులు పని భారం అధికమవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంటే జిల్లా ఎస్పీ శ్రీనివాసులు సీఐ ఆత్మహత్యకి కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు , విధులు నిర్వహించి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన సీఐ ఆనందరావు కు తన భార్య కు చిన్న వాదన జరిగిందని అనంతరం సీఐ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

రాజకీయ వత్తిడి వలనే..(Tadipatri)

తాడిపత్రి సీఐ అనందరావు ఆత్మహత్య ముమ్మాటికీ రాజకీయ ఒత్తిడి కారణమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు , ఆనందరావు చాలా మంచి వ్యక్తి అని ఎదిరించి మాట్లాడలేని మనిషి అని , అలాంటి వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా రాజకీయ నాయకుల స్వలాభం కోసం పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇలాంటి పనులు మానుకోవాలని ఎన్ని రోజులు పోలీసులపై పెత్తనం చెలాయిస్తావని ప్రశ్నించారు.నిన్న జరిగిన ఒక సంఘటన సీఐ ఆత్మహత్యకు ప్రధాన కారణమైందని అన్నారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ చేసిన ఒత్తిడి వల్లే ఇలా జరిగిందని ఈ ఒత్తిడికి ఎమ్మెల్యే సహకరించారని ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు , ఎస్సీ ఎస్టీ కేసులో నుంచి ఫయాజ్ ని తీసివేయాలని సీఐ పై ఒత్తిడి తెచ్చారని అది బరించలేక సీఐ ఆత్మహత్య చేసుకున్నాడని జెసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుక పడ్డాడు ఒక అధికారి చనిపోతే వాటి పైన రాజకీయం చేస్తున్న నువ్వు మనిషివేనా నువ్వు సక్రమంగా మీ అమ్మకి మీ నాన్నకి పుట్టుంటే రుజువు చేసి నిరూపించు అంతేకానీ ఇలా అసత్య ఆరోపణలుఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదు. నువ్వు బ్రతికితే మూడు నాలుగు సంవత్సరాలు బతుకుతావు అలాంటి వాడికి ఇలాంటి ఆరోపణలు చేసి ఏం సాధిస్తావు అని ప్రశ్నించారు. ఈ ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపిస్తామని పెద్దారెడ్డి అన్నారు.