Site icon Prime9

Supreme Court : జీవో నంబర్ 1 విషయంలో ఏపీ సర్కారుకి ఊహించని షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు..

Sedition law

Sedition law

Supreme Court : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 పై స్టే కేసులో సుప్రీంకోర్టు జగన్ సర్కారుకి ఊహించని షాక్ ఇచ్చింది.

ఏపీ హైకోర్టులో వచ్చే సోమవారం ఈ కేసు తదుపరి విచారణ ఉన్న నేపథ్యంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

కందుకూరు, గుంటూరుల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

ఆయా ఘటనల్లో 11 మంది మృతి చెందారన్న కారణంతో జగన్ సర్కారు జనవరి 2న జీవో నం.1 జారీ చేసింది.

దాన్ని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ బు నంద్, జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ నేతృ త్వంలోని ధర్మాసనం ఈ జీవోను జనవరి 23 వరకు నిలుపుదల చేస్తూ 12వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ధర్మాసనం విచారించింది.

అందుకే జోక్యం చేసుకోమంటున్న సుప్రీం కోర్టు (Supreme Court) .. 

హైకోర్టులో ఈ కేసు విచారణ ఉన్నందున తాము ప్రస్తుతం ఇందులో జోక్యం చేసుకోబోమని, సోమవారం దీన్ని విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరతామని సీజేఐ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ అందుకు అంగీకరిస్తూనే ఈ కేసు అత్యవసరం కాకపోయినా సెలవు ధర్మాసనం (వెకేషన్ బెంచ్) దేవా విచారణ చేపట్టడం తీవ్రమైన ఉల్లంఘన అన్నారు.

ఆ రోజు ఉదయం 10.30 గంట లకు కేసును మెన్షన్ చేయగా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మధ్యాహ్నం విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. ఇది సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.

ప్రతివాది రామకృష్ణ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ ఆ వాదనలను ఖండించారు.

inquiry-committee-on-ap stampede issues

ఆ రోజు ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ వాదనలను విన్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాళ్లకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇచ్చినట్లు తెలిపారు.

అప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ తదుపరి వాయిదా సోమవారం హైకోర్టులో ఉన్నందున దాన్ని విచారించమని కోరతామన్నారు.

అది పూర్తయ్యేంతవరకూ దీన్ని పెండింగ్లో ఉంచమని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా అందుకు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉత్తర్వులు జారీచేశారు.

ప్రస్తుతం ఈ కేసు జనవరి 23న హైకోర్టు ముందు లిస్ట్ చేసినందున ఈ దశలో మేం హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వచ్చిన ఫిర్యాదులోని మెరిట్స్ జోలికి పోవడం లేదు.

వచ్చే సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలని మేం సూచిస్తున్నాం” అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.

స్టేను తొలగించకపోతే ప్రమాదం అంటున్న ఏపీ ప్రభుత్వం..

జీవో 1పై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించకపోతే కందుకూరు తరహా దుర్ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో దాఖలు చేసిన ఎస్ఎల్పీలో పేర్కొంది.

హైకోర్టు స్టేను తక్షణం రద్దు చేయకపోతే ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా రాష్ట్రంలోని రహదారులపై రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్లు, ఊరే గింపులు, భారీ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లవుతుంది.

తొక్కిసలాట వంటి దుర్ఘటనలు పునరావృతం కావడానికి దారితీస్తుంది. జీవోపై స్టే ఉన్నందున ఇలాంటి మీటింగులు జరిగితే ప్రజల భద్రత, ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar