Supreme Court; వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ఓట్ల వెరిఫికేషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టేసింది. .ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చిచూడాలని చాలా కాలం నుంచి డిమాండ్ వస్తోంది .ఈ క్రమంలో దీని పై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ లు వేశారు

  • Written By:
  • Updated On - April 26, 2024 / 01:01 PM IST

Supreme Court; ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టేసింది. .ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చిచూడాలని చాలా కాలం నుంచి డిమాండ్ వస్తోంది .అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), అభయ్ భక్‌చంద్ ఛజేద్ మరియు అరుణ్ కుమార్ అగర్వాల్ రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారు..ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్నఆ పిటిషన్లపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

ఎన్నికల కమీషన్ కు సుప్రీం ఆదేశాలు..(Supreme Court)

న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్లాలన్న డిమాండ్‌ను కూడా తోసిపుచ్చింది.బ్యాలెట్ తీసుకురావడానికి సంబంధించిన అన్ని అభ్యర్థనలను మేము తిరస్కరించాముమళ్లీ బ్యాలెట్ పేపర్లను తీసుకురావడానికి సంబంధించిన అన్ని అభ్యర్ధనలను మేము తిరస్కరించామని విచారణలో జస్టిస్ ఖన్నా అన్నారు.విచారణ సందర్భంగా, భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి రెండు ఆదేశాలు ఇచ్చామని ధర్మాసనం పేర్కొంది.ఒక దిశలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, సింబల్ లోడింగ్ యూనిట్ (SLU) సీలు వేయాలి. సింబల్ లోడింగ్ యూనిట్ కనీసం 45 రోజుల పాటు నిల్వ చేయబడాలి అని పేర్కొంది. సీరియల్ నంబర్లు 2 మరియు 3లోని అభ్యర్థుల అభ్యర్థనపై ఫలితాల ప్రకటన తర్వాత మైక్రోకంట్రోలర్ ఈవీఎంలోని బర్న్డ్ మెమరీని ఇంజనీర్ల బృందం తనిఖీ చేస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత ఏడు రోజులలోపు అలాంటి అభ్యర్థన చేయాల్సి ఉంటుంది.పేపర్ స్లిప్‌లను లెక్కించడానికి ఎలక్ట్రానిక్ మెషిన్ కోసం సూచనను పరిశీలించాలని మరియు ప్రతి పక్షానికి చిహ్నంతో పాటు బార్ కోడ్ ఉండవచ్చా అని జస్టిస్ ఖన్నా ఎన్నికల సంఘాన్ని కోరారు.అభ్యర్థన చేసే అభ్యర్థులు వెరిఫికేషన్ (కార్యక్రమం) ఖర్చులు భరించాలని, ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు వాపసు ఇవ్వబడతాయని జస్టిస్ ఖన్నా అన్నారు.ఒక వ్యవస్థను గుడ్డిగా నమ్మకపోవడం అనవసరమైన అనుమానాలకు దారి తీస్తుందని జస్టిస్ దత్తా అన్నారు, ప్రజాస్వామ్యం అంటే అన్ని స్తంభాల మధ్య సామరస్యం మరియు నమ్మకాన్ని కొనసాగించడమని అన్నారు.విశ్వాసం మరియు సహకార సంస్కృతిని పెంపొందించడం ద్వారా మనం మన ప్రజాస్వామ్య స్వరాన్ని బలోపేతం చేయవచ్చు” అని ఆయన అన్నారు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్ల పై గతంలో చాలా మందికి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి .ఒకరికి వేస్తే మరొకరికి ఓటు పడుతుందని సందేహాలు కలిగాయి .కేంద్ర ఎన్నికల సంఘం దీని పై ఎన్నో సార్లు వివరణ ఇచ్చినప్పటికీ అనుమానాలు నివృత్తి కాలేదు .దింతో కనీసం పోలైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ కోర్ట్ ను ఆశ్రయించారు