Supreme Court Judgement on HCU lands: హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కంచ గచ్చిబౌలిలోని భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. తుది ఆదేశాల వరకూ కంచ గచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను త్వరలోనే సందర్శించాలని, అనంతరం ఓ నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ భూమి వివాదం గత 30 ఏళ్లుగా ఉందని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇది అటవీ భూమి అని, దీనికి సంబంధించిన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కోర్టు ఈ విషయంపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు తెలిపింది.