Site icon Prime9

TTD Chairman YV Subbareddy: దళారీ వ్యవస్థను రూపుమాపడానికే శ్రీవాణి ట్రస్ట్ .. టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి

YV Subbareddy

YV Subbareddy

TTD Chairman YV Subbareddy: రాజకీయ లబ్ది కోసం శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదని టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణి ట్రస్ట్ ను పునరుద్ధరించామన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేసి 214 కేసులు నమోదు చేశామన్నారు.

శ్రీవాణి ట్రస్ట్ వద్ద రూ.861 కోట్లు..(TTD Chairman YV Subbareddy)

గత టీడీపీ ప్రభుత్వంలో 2018 లోనే ఈ ట్రస్ట్ ప్రారంభించబడిందని సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం హయాంలో 2019 సెప్టెంబరు 23లో తిరిగి పునరుద్ధరించామన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే పదివేల రూపాయలతో ఆలయ నిర్మాణాలు, పునరుద్ధరణ చేపడుతున్నామని తెలిపారు. 31 మే నాటికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నేటి వరకు 861 కోట్లు వచ్చాయని తెలిపారు. 120.24 కోట్లతో వివిధ దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టామని అన్నారు. వీటిలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఇతర రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేపట్టామని వీటికోసం రూ.139 కోట్లు కేటాయించామన్నారు.

టీటీడీలో అవినీతి చేయడానికి భయపడాలి..

భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణానికి పూనుకున్నామని వీటికోసం 227 కోట్ల 30 లక్షలు కేటాయింపులు జరిగాయని తెలిపారు.
కొంత మంది రాజకీయ నాయకులు ఈ ట్రస్ట్ డోనర్స్ కు రసీదు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. టీటీడీలో ఎంతటి వాడైనా అవినీతి చేయడానికి భయపడాల్సిందేనని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు వున్నా నేరుగా టీటీడీ ని సంప్రదించవచ్చు. రాజకీయ నాయకులు అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలి అని సుబ్బారెడ్డి హెచ్చరించారు.

Exit mobile version