Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్ లో టెస్టుల కోసం వచ్చిన మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరించారు. స్కానింగ్ పేరుతో రహస్య కెమెరాలతో మహిళల నగ్న వీడియోలు రికార్డు చేశాడు స్కానింగ్ ఆపరేటర్. ఇప్పటికే వందలాది వీడియోలు తీసినట్లు తేలింది.
మహిళ ఫిర్యాదుతో..(Nizamabad)
తాను తీసిన న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బాధిత మహిళలు, యువతులకు స్కానింగ్ ఆపరేటర్ బ్లాక్ మెయిల్ చేసేవాడు. లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఓ మహిళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది. స్కానింగ్ సెంటర్లో మహిళలను నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసి లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో.. అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.