Site icon Prime9

Revanth reddy Challenge: 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం .. రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth reddy Challenge: తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాం..24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సవాల్ చేసారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరెంట్ విషయమై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.

కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలి..(Revanth reddy Challenge)

కర్ణాటకలో కరెంట్ ఇవ్వడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. కేటీఆర్ గువ్వల బాలరాజును పరామర్శించి తమపై ఆరోపణలు చేసారని రేవంత్ రెడ్డి అన్నారు. 15 రోజుల్లో ప్రభుత్వంపై కుట్రలు జరగబోతున్నాయని డ్రామారావు అంటున్నాడు. బీఆర్ఎస్ చర్యలు సిగ్గుచేటుగా ఉన్నాయని మండిపడ్డారు. రెండేళ్ల కిందట పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీపై దాడి ఘటన జరిగింది. తరువాత దాడిలో కుట్ర ఏమీలేదని తేల్చారు. ఎంపీ కొత్త ప్రభారకర రెడ్డిపై కత్తితో దాడిచేసిన యువకుడి రిమాండ్ రిపోర్టు ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దాడులు జరుగుతాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేసారు. రిటైరయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. మా ఫోన్లు హ్యాకింగ్ అవుతన్నాయని చెప్పినా స్పందించలేదని రేవంత్ అన్నారు.

కుమారస్వామి ప్రెస్ మీట్ తో హరీష్ కు ఏం సంబంధం?

జేడీఎస్ నేత కుమారస్వామి ప్రెస్ మీట్ ప్రసారం చేయాలని హరీష్ రావు టీవీ చానళ్లకు ఫోన్లు చేసారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమారస్వామి హరీశ్‌రావు సమన్వయం చేయడమేంటి? అతనికేమి అవసరం అంటూ రేవంత్ రెడ్డి అడిగారు. మైనారిటీలను బీసీల్లో చేర్చుతామంటూ కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మాదిగలను ప్రధాని మోదీ మరోసారి మోసం చేసారు. డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇస్తుంది. బీఆర్ఎస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

Exit mobile version