Site icon Prime9

BL Santosh : బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కి ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే

BL Santosh

BL Santosh

BL Santosh: బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కి తెలంగాణ హైకోర్టులో శుక్రవారంనాడు ఊరట లభించింది. సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని కూడా ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది చెప్పారు. ఫిర్యాదులో సంతోష్ పేరు లేకున్నా ఎఫ్ఐఆర్ లో ఎలా చేర్చారని న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేులో బీఎల్ సంతోష్ కు సంబంధించిన ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ వాదించారు. సిట్ విచారణకు సంతోష్ వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అడ్వకేట్ జనరల్ చెప్పారు.

41 ఏ నోటీసులిచ్చిన తర్వాత సంతోష్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్టుగా ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని సంతోష్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. 41 ఏ నోటీసుల విషయంలో సింగిల్ జడ్జి ఆదేశాలను ఏజీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీఎల్ సంతోష్ కు రెండు దఫాలు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై స్టే ఇచ్చింది హైకోర్టు.

తెలంగాణ హైకోర్టు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ శుక్రవారంనాడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్ననే రెండోసారి సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి జారీ 41 ఏ సీఆర్‌సీపీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించారు. ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది.

 

Exit mobile version
Skip to toolbar