Site icon Prime9

Tirupati Priest Death: తిరుపతి జిల్లాలో అర్చకుడి ఆత్మహత్య

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీవశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కింద నేపాల్ నుంచి వచ్చిన ప్రసాద్ శ్రీ వశీష్ట ఆశ్రమంలో అర్చకుడిగా చేరాడు. అంతకుముందు కాశీలో అర్చకత్వం చేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నుంచి శ్రీ వశీష్ట ఆశ్రమంలో అర్చకత్వం చేస్తుండేవాడు.

నిత్యం పూజలు చేస్తూ ఉండే ఈ అర్చకుడు ఉదయం విగత జీవిగా మారటాన్ని చూసి చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు. ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Exit mobile version