Site icon Prime9

Janasena in-charge Vinutha: తిరుపతి జిల్లాలో జనసేన ఇన్ చార్జ్ వినుతను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Vinutha

Vinutha

Janasena in-charge Vinutha: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మూడు రోజులుగా జనసేన ఇన్ చార్జ్ వినుత ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. చిందేపల్లిలో ఇసిఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆర్ అండ్ బి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో.. 17 గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించకపోవడంతో గ్రామస్తులకు మద్దతుగా జనసేన ఇన్ చార్జ్ వినుత ఆమరణ నిరాహారదీక్ష చేస్తుడడంతో ఆరోగ్యం క్షిణించింది.ఈ ఆందోళనకు జిల్లా ఇన్ చార్జ్ హరిప్రసాద్ మద్దతు పలికారు.

గ్రామస్తులను చితకబాదిన పోలీసులు..(Janasena in-charge Vinutha)

ఇదిలా ఉంటే కాసేపటి క్రితం జనసేన ఇన్‌చార్జ్ వినుతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధేశ్వర స్వామి ఆలయం తలుపులు పగులకొట్టి వినుతని అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న గ్రామస్తులపై లాఠీచార్జ్ చేశారు. దీనితో గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో సిఐ తలకి గాయాలయ్యాయి.ఈ ఘటనలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి,.దీంతో ఇళ్ళల్లోకి దూరిన పోలీసులు ప్రజలని చితకబాదారు. 10మంది గ్రామస్తులు గాయపడ్డారు.

Exit mobile version