Hyderabad Metro: ప్రతిఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్ ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా నుమాయిష్ జరిగే అన్ని రోజులు మెట్రో రైలు సేవలను రాత్రి మరో గంటపాటు పొడిగించింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నారు. టర్మినల్ స్టేషన్లు అయిన ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం నుంచి సాధారణంగా రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది.
అయితే నుమాయిష్ ముగిసే వరకు చివరి సర్వీసు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మియాపూర్-ఎల్బీ నగర్ (రెడ్ లైన్), నాగోల్ నుంచి రాయదుర్గం (బ్లూ లైన్) కారిడార్లలో మాత్రమే పొడిగింపు ఉంటుందని తెలిపారు. ఎగ్జిబిషన్ కి వచ్చే ప్రయాణికుల రద్దీ కారణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గాంధీభవన్ మెట్రో స్టేషన్‌లో4 టిక్కెట్ కౌంటర్లను 6కు పెంచారు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా మెట్రో సర్వీసులను డిసెంబరు 31న అత్యధికంగా 4.57 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించారు.