Site icon Prime9

Group-4: తెలంగాణలో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Group-4 posts

Group-4 posts

Telangana News: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలే గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలిపింది.

అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపింది. వివరణాత్మక నోటిఫికేషన్, వయస్సు, వేతన స్కేల్, విద్యార్హతలు, ఇతర వివరణాత్మక సూచనలు.. కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టుగా పేర్కొంది.

గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్ – 429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్ – 6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్ – 18 పోస్టులు, వార్డు ఆఫీసర్ – 1,862 పోస్టులు ఉన్నాయి.

Exit mobile version