Nara Lokesh Comments on VC Resignation: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలిలో వీసీల రాజీనామా అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని ఆయన స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో ‘బెదిరించినట్లు’ అనే వర్డ్ ఎక్కడా కూడా లేదని వివరించారు.
కాగా, వైసీపీ నియమించిన వీసీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయంలో ఎన్నికైన వీసీలకు కనీసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ రాదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అయితే రాజీనామా చేసిన వీసీలలో రాజారెడ్డి చెల్లెలి కోడలు ఒకరున్నారన్నారు. మరొక్క వీసీ కూడా రాజీనామా చేయగా.. ఆయనే ప్రసాద్ రెడ్డి అన్నారు. అయితే ఈయన వైసీపీ కార్యకర్త అని వెల్లడించారు.
అలాగే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం జగన్ జన్మదిన వేడుకలను ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారన్నారు. దీంతో పాటు పార్టీల కోసం సర్వేలు కూడా చేయించిన ఘనత వీసీలదేనని లోకేశ్ స్పష్టం చేశారు.