Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వీడారు అనే విషయాన్ని తెలుగు ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. అయితే ఫిబ్రవరి 18న ఆయన తుదిశ్వాస విడిచాడు. తారకరత్న నివాళులు, అంత్యక్రియలు, చిన్నకర్మ కార్యక్రమాలను బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నందమూరి కుటుంబ సభ్యులు కలిసి దగ్గరుండి చూసుకున్నారు.
హాజరు కానున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు (Nandamuri Taraka Ratna)..
కాగా నేడు (మార్చి 2) గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలని కూడా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకోనున్నారు. దీంతో నేడు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్దకర్మకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.
ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఆశించిన రీతిలో ఆయన విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం ‘అమరావతి’తో రాష్ట్ర పురస్కారం నంది అందుకున్నారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ ‘9 అవర్స్’లో సీఐ రోల్ చేశారు. బాలయ్య సినిమాలో నటించాలి అనే కోరిక తీరకుండానే తారక రత్న ఈ లోకాన్ని వీడడం ఎంతో బాధాకరం.
అనంతపురం జిల్లాకు చెందిన మధు సూదన్‌రెడ్డి కుమార్తె. అలానే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. భార్య చెల్లెలి కుమార్తె గా అత్యంత దగ్గరి బంధువులు. కాగా తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వర’ సినిమాకు అలేఖ్యరెడ్డి కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్యను పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబీకులు ఆమోదించలేదు. దీంతో వారిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. 2013 డిసెంబర్ 21 వీరిద్దరికి పాప జన్మించింది. ఆ అమ్మాయికి.. నిష్క అని నామకరణం చేశారు. 2014లో జరిగిన తన సోదరి రూప పెళ్లికి కూడా తారకరత్న వెళ్లలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇటీవల తన భర్త, పిల్లలతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి మరోసారి భావోద్వేగానికి గురైంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదట తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న అలేఖ్య.. ‘ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ‘నన్ను మా అమ్మా బంగారు’ అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది’ అని ఎమోషనలైంది. తారకరత్న అభిమానులు, నెటిజన్లు అలేఖ్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/