Site icon Prime9

Pranay Murder case: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితులకు శిక్ష ఖరారు

Nalgonda Court Sentences life to Pranay Murder Accused in Pranay Murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ హత్య కేసులో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంతో పాటు మిగతా నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జిల్లా రెండో అదనపు సెషన్ కోర్టు జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించింది. కాగా, 2018లో సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. ఈ మేరకు ఆరేళ్లకు పైగా విచారణ కొనసాగింది.

ప్రణయ్, అమృతలు కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా కొంతమందికి సుపారీ ఇచ్చారు. దీంతో ప్రణయ్, అమృతలు ఓ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారు. ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు చేశారు.

అయితే, ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన అమృత తండ్రి మారుతీరావు 2020లో సూసైడ్ చేసుకున్నాడు. మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉండగా.. ఒక్కరు చనిపోవడంతో ఏడుగురు మిగిలారు. అందులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష గతంలోనే విధించగా.. మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదీగా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రణయ్ హత్య విషయంలో కుట్ర పన్ని చంపినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నల్గొండ కోర్టు తీర్పు చెప్పింది.

కాగా, నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్ మాట్లాడారు. 9 నెలలు కష్టపడడి ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. ఈ కేసులో ఏ ఎవిడెన్స్‌ను కూడా వదలేదని చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలతో కేసును నిరూపించామని, నిందితుడికి ఉరిశిక్ష పడడం సంతోషంగా ఉందన్నారు.

Exit mobile version
Skip to toolbar