Motkupalli Narsinhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద హైడ్రామా సృష్టించారు. కేసీఆర్‌ను సమర్థించి తప్పుచేశానని ఆవేదన చెందారు. దళితబంధు అమలు కాకుంటే చస్తానని హెచ్చరించారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు.
చంద్రబాబును చంపాలని చూస్తున్నారు..(Motkupalli Narsinhulu)
ఈ సందర్బంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు(వైఎస్ఆర్ సిపి, బిజెపి, బిఆర్ఎస్) కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని ఆయన వెల్లడించారు. ఏపీలో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబును బయటకు రాకుండా చూసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నమా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు.చంద్రబాబుకు ఏమైనా అయితే జగన్, కెసిఆర్, బిజెపిదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారని నర్సింహులు ఆరోపించారు. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం జగన్ అని సెటైర్లు వేశారు. కేసీఆర్ ముహూర్తం పెడితే., గడ్డి మందు తాగి చనిపోతానని అన్నారు.మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆరని అన్నారు. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని పేర్కొన్నారు.