Site icon Prime9

MLC Kavitha: అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గానుసందర్శించి చాదర్‌ను సమర్పించారు. ఈ సందర్బంగా ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కవిత మతపెద్దలకు వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.

అనంతరం పుష్కర్‌, శ్రీనాథ్‌జీ దేవాలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించి పూజలు చేశారు. ఆమె వెంట బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి అయేషా, కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఆజం అలీ, కుద్దూస్‌, నవీద్‌ ఇక్బాల్‌, అలీం తదితరులు ఉన్నారు.

Exit mobile version