Site icon Prime9

Minister Ponguleti: అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguleti Key Comments About Double BedRoom Houses: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి స్థలం లేని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

అయితే, అసంపూర్తిగా వదిలేసిన ఇళ్ల విషయంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులు పూర్తిచేసుకునేలా చేయాలన్నారు. ఒకవేళ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసుకుంటామంటే వారికి ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు. ప్రధానంగా పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించడంతో పాటు పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలన్నారు. తొలుత బేస్ మెంట్ పూర్తి చేసిన వెంటనే మొదటి విడత కింద లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కు అందించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.Double BedRoom

Exit mobile version
Skip to toolbar