Site icon Prime9

Azad Encounter : మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్ ఎన్‌కౌంటర్ .. 29 మంది పోలీసులపై విచారణకు కోర్టు ఆదేశం

Azad Encounter

Azad Encounter

Azad Encounter : మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై మూడు నెలల్లో విచారణ ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీత ఆదేశించారు.

ఆదిలాబాద్ జిల్లాలో 2010 జూలై 1న వాంకిడి మండలం వెలిగి సర్కేపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ జరిగింది. . ఆయనతో పాటు జర్నలిస్ట్ హేమచంద్ర పాండే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు అనేక అనుమానాలను వ్యక్తం చేశాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ.. అప్పటి ఏపీ పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది.

నిజమైన ఎదురు కాల్పుల్లోనే ఆజాద్, హేమచంద్ర మరణించారని సీబీఐ నిర్ధారించిందని సుప్రీంకోర్టు ప్రకటించింది.అయితే ఈ కేసు విషయమై కింది కోర్టులో అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించడంతో బాధితులు మరోసారి ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించారు.

Exit mobile version