Site icon Prime9

Liquor Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్!

Liquor Shops closed Holi festival on March 14 hyderabad: మందుబాబులకు మరో బిగ్ షాక్. ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న మందుబాబులకు పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈనెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండగ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పలు సూచనలు పోలీస్ శాఖ వెల్లడించింది.

 

అలాగే ఎవరైనా మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించవ్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా హోలీ పండగ చేసుకోవాలని సూచించారు.

 

మరోవైపు, హోలీ పండుగ సందర్భంగా బీఫ్ దుకాణాలను మూసి వేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా, హోలీ పండగను పురస్కరించుకొని విద్యాసంస్థలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

Exit mobile version
Skip to toolbar