Site icon Prime9

MLA Harshavardhan Reddy: మెదడు వ్యాధి బాధితుడికి ఆర్దికసాయం అందించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే..

CMRF

CMRF

CMRF: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి చికిత్స కోసం చీప్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్ ) పధకం కింద రూ.2,50,000/- ఎల్వోసీని మంజూరు చేయించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన జి. చిన్నకిష్టన్న మెదడుకు సంబంధించిన వ్యాదితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కుటుంబం పరిస్దితిని స్దానికులు ఎమ్మెల్యేకు తెలియజేయగా ఆయన వెంటనే స్పందించారు. మెరుగైన వైద్యంకోసం సీఎంఆర్ఎఫ్ కింద రెండులక్షలయాభైవేలరూపాయలు మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాణాపాయ స్దితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చికిత్సకు అవసరమైన ఆర్దికసాయాన్ని అందజేస్తోందని అన్నారు. ఇలా ఉండగా తమ వినతిని మన్నించి చికిత్సకు అవసరమైన ఆర్దికసాయాన్ని అందించినందుకు చిన్న కిష్టన్న కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్జతలు తెలిపారు.

Exit mobile version