Site icon Prime9

MP Soyam Bapurao: మతమార్పిడులు ఆపకపోతే బుల్లెట్లు దించుతాం.. అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

BAPURAO

BAPURAO

MP Soyam Bapurao:  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాం లీలా మైదానంలో జన జాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో సోయం బాపూరావు పాల్గొన్నారు. 12మంది పాస్టర్లు ఇప్పటి వరకూ 1200మందిని మతమార్పిడి చేశారని బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు, క్రిస్టియన్‌ యువకులు ఆదివాసి మహిళలను బలవంతం గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని సోయం వెల్లడించారు. ఇకనైనా మతమార్పిడులు ఆపకపోతే బుల్లెట్లు దించుతామని సోయం బాపూరావు హెచ్చరించారు.

పోడు భూములకు అడ్డు వస్తే కేసులు పెట్టండి..(MP Soyam Bapurao)

మాయ మాటలు నమ్మి ఆదివాసి మహిళలు మోస పోవద్దు.మత మార్పిడి అయిన వారిని తొలగించాలని పార్లమెంట్ లో మాట్లాడతా.బిల్లు పెట్టి తీపిస్తా.ఆలోపు మళ్లీ తిరిగి రండి లేదంటే గుండు కొట్టిస్తా.పోడు భూములకు అడ్డు వస్తే  వారి పైనే కేసులు పెట్టండి.పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటే తిరిగి కేసులు పెట్టండి.పోడు భూముల పోరాటం చేసిన వారికి  నేను అండగా ఉన్నా.ఖమ్మం జిల్లా లో అధికారిని చంపి జైలు కు వెళ్లిన వారికి నేను అండగా ఉన్నాను. కోయ పోచ గూడ ఆదివాసీలకు అండగా ఉన్నానని బాపూరావు అన్నారు.

అంతేకాదు ఆదివాసీలు రావణుని పూజిస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు.అలా ప్రచారం చేసే పాస్టర్లను నిలదీయాలి.ఆదివాసీలు రావణునిడి ని పూజిస్తే రాముడు, హనుమాన్ దేవాలయాలు ఎందుకు ఉన్నాయి? అంటూ బాపూరావు ప్రశ్నించారు.

Exit mobile version