Ajay Kallam: వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నది ఆ రోజు తనకి తెలియదని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం వైఎస్ వివేకా మరణించారని మాత్రమే ప్రస్తుత సిఎం జగన్ అప్పుడు తమకి చెప్పారని తెలిపారు. వివేకా హత్య కేసులో అంశాలని వక్రీకరించడం, దర్యాప్తు అంశాలు లీక్ కావడం కూడా సరికాదని అజయ్ కల్లాం అభ్యంతరం వ్యక్తం చేశారు.
సిబిఐ అధికారి నన్ను కలిసి మాట్లాడారు.నాకు తెలిసిన సమాచారం చెప్పాను. వివేకా మరణం గురించి వైఎస్ జగన్ మాకు చెప్పారు.వివేకా గుండెపోటుతో చనిపోయారని మాకు చెప్పలేదు.గుండెపోటా.? మరో కారణమా అన్న విషయం సిబిఐ అడగలేదు.ఆ సమయంలో ఉన్న నలుగురిలో నేను ఒకడిని.ఏ సమయంలో చెప్పారన్నది నాకు గుర్తు లేదు.వివేకా హత్య కేసులో విషయాలని వక్రీకరించ కూడదు. దర్యాప్తు అంశాలు లీక్ కావడం కూడా సరికాదని అజయ్ కల్లాం అన్నారు.
హత్య జరిగిన సమయంలో తన ప్రధాన సలహాదారు అజేయ కల్లంతో తన మామ గుండెపోటుతో చనిపోయారని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని, అయితే ఆ తర్వాత మాట మార్చారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ సంఘటన గురించి ప్రజలకు తెలియగానే మాజీ ఎంపీని నరికి చంపారని చెప్పారు.సిబిఐ ముఖ్యమంత్రిని పిలిపించి, వివేకానంద రెడ్డి మరణించిన విధానం గురించి మీకు ఎలా తెలుసు, మరియు అతను (ముఖ్యమంత్రి) ఈ సంఘటనను ఇంత సూక్ష్మంగా ఎలా చెప్పగలిగారు అని అడగాలి. అప్పుడే దాచిన రహస్యాలు వెలుగులోకి వస్తాయని అచ్చెన్నాయుడు అన్నారు.
https://youtu.be/oi9GETfOmN8