Site icon Prime9

Global Investors Summit 2023 : అట్టహాసంగా ప్రారంభమైన “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”..జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం జగన్

global investors summit 2023 started in vizag

global investors summit 2023 started in vizag

Global Investors Summit 2023 : విశాఖపట్నం వేదికగా “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు. ఆ సమయంలో వేదికపై సీఎం జగన్, ముఖేష్ అంబానీతో పాటు, కరణ్ ఆదానీ, జీఎంఆర్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. గీతాలాపన అనంతరం సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

కాగా ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు విశాఖకు తరలిరావడంతో.. పోలీసులు యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 2,500 మందితో భద్రత కల్పిస్తుండగా.. ప్రధాన వేదిక ప్రాంగణం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని సీపీ తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. హోటల్స్, ప్రయాణించే మార్గాలు అన్నీ పూర్తి స్థాయి భద్రతలో ఉంటాయన్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రులను ఎయిర్‌పోర్ట్‌ నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. పారిశ్రామిక దిగ్గజాలను దృష్టిలో పెట్టుకుని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం‌ కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.

 

మంత్రి అమర్నాథ్ ఏమన్నారంటే..?

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, డెవలప్ మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ముందుందని ప్రసంగించారు. అంతకుముందు ఆంధ్రా యూనివర్సిటీ స్థలంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు అవుతున్న దిగ్గజాలకు సాంప్రదాయ రీతిలో ఆహ్వానం పలికారు. గిరిజన నృత్యాలు చేస్తూ అలరించారు.

 

 

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఏమన్నారంటే..?

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్‌ ఇండస్ట్రీపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్‌ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version