Site icon Prime9

ED Investigation: ఈడీ విచారణకు హాజరయిన గీతారెడ్డి, అనిల్ కుమార్

E D

E D

ED Investigation: నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, అనిల్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. వీరిద్దిరినీ మూడు గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. ఈడీ అధికారులు కోరిన సమాచారాన్ని గీతారెడ్డి, అనిల్ కుమార్ లు అందించారు. విచారణ ముగిసిన తర్వాత మరోసారి రావాలని తనను కోరలేదని గీతారెడ్డి మీడియాకు చెప్పారు. అయితే ఈడీ అధికారులు ఏ విషయాలపై ప్రశ్నించారనే విషయమై చెప్పేందుకు మాత్రం గీతారెడ్డి నిరాకరించారు.

ఈ కేసులో విచారణకు హాజరుకావాలనిసెప్టెంబర్ 23న కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆ పార్టీ నేత గాలి అనిల్ కుమార్ లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీ విచారణ ముగిసింది. నేడు గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ లను ఈడీ అధికారులు విచారించారు. ఎల్లుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరుకావడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే కేసులో కర్ణాటకకు చెందిన నేతలు డీకే శివకుమార్ ఆయన సోదరుడు డీకే సురేష్ లు రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

Exit mobile version