Site icon Prime9

Bhadrachalam: భద్రాచలం రామాలయంలో బూజుపట్టిన లడ్డూల విక్రయాలు.. భక్తుల ఆగ్రహావేశాలు

bhadrachalam laddu

bhadrachalam laddu

Bhadrachalam: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు రావడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు.. వినూత్నంగా నిరసన తెలిపారు. ఇక్కడ బూజుపట్టిన లడ్డూలు అమ్మబడును అని పేపర్‌పై రాసి అతికించారు.

ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులు కోసం దాదాపు రెండు లక్షల లడ్డూలను భద్రాచలం(Bhadrachalam) ఆలయ సిబ్బంది తయారు చేసింది. భక్తులకు పంపిణీ చేయగా మిగిలిపోయిన లడ్డూలను సరిగా భద్రపరచలేదు. దీంతో ఆ లడ్డూలు ఫంగస్, బూజు పట్టాయి. వాటిని సిబ్బంది భక్తులకు ప్రసాదంగా విక్రయించారు. ఆగ్రహించిన భక్తులు లడ్డూల కౌంటర్ వద్ద ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును అని రాసి నోటీసు సైతం అతికించారు. ఈ నోటీసు ఆలయం ప్రసాదం కౌంటర్ వద్ద కలకలం రేపింది.

బాధ్యతారాహిత్యంగా అధికారులు

లడ్డూలకు ఫంగస్ వస్తే అవి తీసేసి, నాణ్యత ఉన్న లడ్డూలు విక్రయించాలి కానీ, రాములోరి భక్తులకు ఇలా పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అంటూ భక్తులు గొడవకు దిగుతున్నారు. లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గతంలో కూడా ఈ ఆలయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అయినప్పటికీ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. లడ్డూలను కౌంటర్లలో వేడివాతావరణం మధ్య అలాగే వదిలేస్తుండటంతో తొందరగా బూజు వచ్చి పాడవుతున్నాయి. అంచనాలు లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో లడ్డూలు తయారు చేయించడం, స్టాక్‌ ఉంచడంతో అవి బూజు పట్టి వృథా అవుతున్నాయి. సుమారు 50,000 లడ్డులకు బూజు, ఫంగస్ పట్టాయని తెలుస్తోంది. అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడం వలనే ఇటువంటి పరిస్దితులు తలెత్తుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు.

రాములోరి ప్రసాదం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం (Bhadrachalam) సీతారాముల ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. యాదాద్రి ప్రసాదం, భద్రాచలం ప్రసాదం తెలంగాణలో ఫేమస్. కానీ భద్రాచలం ఆలయంలో రాములొరి ప్రసాదంలో బూజుపట్టిన లడ్డూలు పంపిణీ చేస్తున్నారు. తమకు వచ్చిన లడ్డూలు పాచి పోయి ఉండటం, బూజు పట్టి ఉండటాన్ని గమనించిన భక్తులు ఆలయ నిర్వాహకులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Virat kohli: ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్

Shaakunthalam Trailer: ‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత

Dil Raju: నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version