Kanna Lakshminarayana: ప్రైమ్9 న్యూస్ ఛానల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం కాణిపాకంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

  • Written By:
  • Updated On - January 18, 2023 / 08:12 PM IST

Kanna Lakshminarayana: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం కాణిపాకంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రైమ్9 న్యూస్ ఛానల్ నిష్పాక్షింగా వార్తలను ప్రసారం చేస్తోందని కొనియాడారు.

జర్నలిస్టులు ప్రజా సమస్యలను అధికారయంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి తమ వంతు సాయం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మరియు జనసేన నాయకులు పూల ప్రభాకర్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఎం. మునురాజులు పాల్గొన్నారు.

వీరితో పాటు సంయుక్త కార్యదర్శి జిల్లా జనసేన పార్టీ నెహ్రూ రాయల్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కుమార్ మరియు పూతలపట్టు జనసేన నాయకులు పవన్ రాయల్, బిజెపి నాయకులు, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.

జగన్-కేసీఆర్ కలిసి కుట్ర

జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నేతల చేరికలు జరుగుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) అన్నారు.

ఆంధ్రాలో పవన్, తెలంగాణలో బండి సంజయ్‭ని బలహీనపరిచేందుకే జగన్, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని కన్నా ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‭కు తాను అండగా ఉంటానని కన్నా చెప్పారు.

మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు.

తన వియ్యంకుడు బీఆర్ఎస్‭లో ఎందుకు చేరాడో సోమువీర్రాజు సమాధానం చెప్పాలన్నారు.

తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో సోము చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

జనసేన వైపు కన్నా చూపు..?

ఇటీవల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలిసారు. దీనితో ఆయన జనసేనలోకి వెళతారన్న ప్రచారం అప్పటి మొదలయింది.

జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి ఇటీవల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలిసారు.

దీనితో ఆయన జనసేనలోకి వెళతారన్న ప్రచారం మొదలయింది. జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలం నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/