Site icon Prime9

Kiran Kumar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

kiran kumar

kiran kumar

Kiran Kumar Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.

భాజపాలో చేరనున్న కిరణ్ కుమార్ (Kiran Kumar Reddy)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ మేరకు ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. త్వరలోనే ఆయన దిల్లీ వెళ్లి ప్రధాని, అమిత్‌ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రాజీనామా అనంతరం బీజేపీ అగ్రనేతల సమక్షంలో కిరణ్ కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా..

కొద్ది రోజులుగా ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటు వస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్ల పాటు సైలెంటుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. బీజేపీ పెద్దలు ఆయనతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు పార్టీలో ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా కూడా పనిచేశారు. 2010 నవంబర్‌లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేదు.

రాజకీయాల పరంగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. బీజేపీ కి కలిసొచ్చే అంశమేనా అని అంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్, రాజా సింగ్ వంటి బలమైన నేతలు ఉన్న తరుణంలో కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి వంటి మాజీ సీఎం స్థాయి నేత బీజేపీ లోకి రావడం అంటే కలిసొచ్చే అంశం అని చెప్పాలి.

Exit mobile version