Site icon Prime9

Earthquake : నెల్లూరు జిల్లాలో భూకంపం

Earthquake

Earthquake

Earthquake: నెల్లూరు జిల్లాలో సోమవారం ఉదయం భూమి కంపించింది. జిల్లాలోని చేజర్ల మండలం ఆదురుపల్లిలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.ఈ ఏడాది ఆగస్టులో కూడా నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో 6 నుంచి 10 సెకన్లపాటు తేలికపాటి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అపుడు వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లో చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్ధం వినిపించిందని, ఆ తర్వాత ప్రకంపనలు వచ్చినట్లు స్థానికకులు తెలిపారు.

ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం లేదని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ప్రకంపనాలు చోటుచేసుకుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఎలాంటి ప్రమాదమూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version