Cs Somesh Kumar: తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు మేరకు ఏపీకి వెడుతున్నారు. ఈ నేపధ్యంలో సీఎస్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలపై పలువురు ప్రతిపక్షనాయకులు, ప్రజాసంఘాలు గుర్తుకు తెస్తున్నారు. వీటిలో ధరణి పైన వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఒక ఉపాధ్యాయుడు 317 జీవోను గుర్తు చేస్తూ సోమేష్ కుమార్ కు లేఖ రాసారు.
మీకు కర్మసిద్దాంతం అంటే ఏమిటో తెలుసా? మీరు మమ్మల్ని ఏవిధంగా బదిలీ చేసారో కోర్టు మిమ్నల్ని కూడా అలాగే బదిలీ చేసింది. మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎప్పటికయినా మనం కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది. దీనినే కర్మ సిద్దాంతం అంటారు అని సెటైర్లు వేసారు.
తెలంగాణలో 10 జోన్లను ప్రభుత్వం 33 జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ప్రభుత్వం తెచ్చిన 317 జీవోను పలువురు ఉద్యోగులు వ్యతిరేకించారు. ఈ జీవోను రద్దుచేయాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఎందుకంటే స్దానికతను కాకుండా సీనియారిటీ ప్రకారం బదిలీలను చేయడమే దీనికి కారణం. దీనితో సొంత జిల్లాలను విడిచి వెళ్లవలసిన పరిస్దితి వచ్చిందని వారు భావించారు. ఇరవైవేల మందికి పైగా ఉపాధ్యాయులు ఈ జీవో కింద బదిలీ అయ్యారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/