Site icon Prime9

Rishikonda: రిషికొండలో తవ్వకాలను పరిశీలించిన సీపీఐ నారాయణ

Rishikonda

Rishikonda

Rushikonda: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శుక్రవారం రుషికొండ చేరుకుని అక్కడ తవ్వకాలను పరిశీలిస్తున్నారు. అంతకుముందు ఆయన పర్యటన సందర్బంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, విశాఖ జిల్లాకు చెందిన సీపీఐ నేతలను రిషికొండకు వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. టూరిజం శాఖకు చెందిన వాహనంలోనే పోలీసులు నారాయణను తీసుకెళ్లారు. రిషికొండకు సమీపంలోనే రామకృష్ణ సహా ఇతర సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. నారాయణతో పాటు తమను కూడా పంపాలని సీపీఐ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా రిషికొండలో శుుక్రవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు అనుమతితో రిషికొండను పరిశీలించేందుకు వెళ్లిన నారాయణ సహా సీపీఐ నేతలను పోలీసుులు అడ్డుకున్నారు. రిషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి ఒక్కరినే అనుమతించారు పోలీసులు. . రిషికొండలో నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయవద్దని కూడ ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ సందర్బంగా రిషికొండలో భారీగా పోలీసులు మోహరించారు.

రిషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన తనను అడ్డుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు రిషికొండలో నిర్మాణాల పరిశీలనకు హైకోర్టు అనుమతించింది. నవంబర్ మొదటి వారంలో ఈ నిర్మాణాలను పరిశీలించాలని కోరింది. అయితే ఆ సమయంలో తనకు వీలు కాదని నారాయణ హైకోర్టుకు తెలిపారు. దీనితో నేడు రిషికొండలో నిర్మాణాల పరిశీలనకు నారాయణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Exit mobile version