Site icon Prime9

హైదరాబాద్: టీ కాంగ్రెస్ సంక్షోభం.. రంగంలోకి దిగిన డిగ్గీరాజా.. సీనియర్ల సమావేశం వాయిదా..

Digvijay singh

Digvijay singh

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ లో సమస్యలను పరిష్కరించాలని భావించిన ఏఐసీసీ పార్టీ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ కు ఈ బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. తరువాత దిగ్విజయ్ ను తెలంగాణపై ఫోకస్ పెట్టాలని పార్టీ పెద్దలు సూచించారు.

గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ పార్టీ ఇన్ చార్జీగా ఉన్నారు. అందువలన ఇక్కడ జిల్లా, రాష్ట్రస్దాయి కాంగ్రెస్ నేతలందరూ ఆయనకు పరిచయమే. తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం మరింత పెద్దది కాకుండా, అసంతృప్తి నేతలు బీజేపీ వైపు చూడకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇందులో భాగంగా దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది. దిగ్విజయ్ సింగ్ మంగళవారం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇవాళ సాయంత్రం నిర్వహించతలపెట్టిన సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. దీనితో ఇవాళ సాయంత్రం జరిగే సమావేశాన్ని సీనియర్లు వాయిదా వేసుకున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ సీనియర్లను కలిసారు. నేడు జరిగే సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.

Exit mobile version